భార్య భర్తల ప్రేమ అనుబంధం వర్ణించలేనిది. ఒకరిని ఒకరు ఎంతో ఇష్టపడి నమ్మకంతో జీవితంలో ముందుకు వెళతారు. ఒకరిపై ఒకరు చూపించే ఆప్యాయత ప్రేమ వెలకట్టలేనిది అని చెప్పాలి. పుట్టిన ఇంటి నుంచి మెట్టినింటికి వచ్చి భార్య కూడా భర్త కుటుంబం పేరు ప్రతిష్టలు నిలబెడుతుంది. అయితే కొందరు భార్య భర్తలు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఉంటారు. ఎవరు దూరం అయినా వారు తట్టుకోలేరు.
అలాంటి అన్యోన్య జీవితంలో సడెన్ గా ఆ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబంలో విషాదం అలుముకుంటుంది. అయితే భార్య మృతిని తట్టుకోలేని ఓ భర్త ఆమె చితిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశాలోని కలహండి జిల్లా గోలముండా సమితిలోని శైలుజోడి గ్రామంలో ఈ ఘటన జరిగింది.
రాయబారి , నీలమణి శబరి వీరిద్దరూ భార్యాభర్తలు. వీరికి నలుగురు కుమారులు భార్య చనిపోయింది. అయితే రాయబారిని శ్మశానానికి తీసుకువెళ్లారు. అక్కడ చితిపేర్చి మృతదేహానికి నిప్పు అంటించారు. అందరూ ఇళ్లకు బయలుదేరారు. అయితే భార్య మృతిని తట్టుకోలేక భర్త నీలమణి ఆ చితిమంటల్లో దూకాడు చివరకు అతను కూడా మరణించాడు.