Flash- దారుణం..భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

The husband who poured petrol on his wife and set her on fire

0
100
Kabul

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దూదేకుల హుస్సేన్ బిని కట్టుకున్న భర్తే హత మార్చాడు. హుసేన్ బి కి ఆరు సంవత్సరాల క్రితం కర్నూలు జిల్లా బేతంచర్ల సమీపంలోని బైడ్ పేటకు చెందిన హుస్సేన్ భాషాకు ఇచ్చి తల్లిదండ్రులు వివాహం చేశారు.

అయితే హుస్సేన్ వేరే మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను తరచు వేధిస్తూ ఉండేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేక హుస్సేన్ బి ఇటీవల కొమరోలు మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి వచ్చి తల్లిదండ్రుల వద్దే ఉంటుంది.

భార్యను హుసేన్ బి తీసుకువెళ్లేందుకు వచ్చిన హుస్సేన్ భాషా అత్తమామలతో తను మారినట్లు భార్యను బాగా చూసుకుంటాను అని చెప్పి నమ్మించి తిరిగి తన స్వగ్రామానికి బేతంచెర్లకు తీసుకువెళ్ళాడు. అప్పటికే భార్య పై కోపం పెంచుకుని ఉన్న హుస్సేన్ భాషా భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

దీంతో హుస్సేన్ బి ఆ మంటల్లో చిక్కుకొని ప్రాణాలు వదిలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుడికి శిక్షపడేలా చూడాలంటూ హుస్సేన్ బి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.