మ‌ల‌ద్వారంలో బ‌తికున్న చేప‌ని పెట్టుకున్న వ్య‌క్తి – షాకైన వైద్యులు ఎందుకంటే

The man who kept the fish alive in Anus

0
128

కొంత మంది చేసే ప‌నులు చాలా వింత‌గా విచిత్రంగా ఉంటాయి. అస‌లు ఇలా ఎలా చేస్తారా అనే అనుమానం భ‌యం కూడా క‌లుగుతాయి. మ‌నం ఎన్నో ర‌కాల వైద్య విధానాలు చూశాం. ఇక ఉబ్బ‌సం స‌మ‌స్య ఉంటే చేప మందును నోట్లో వేస్తారనే సంగతి తెలిసిందే. కానీ ఓ వ్య‌క్తి ట్రీట్మెంట్ కోసం
ఏకంగా మలద్వారం నుంచి చేపను లోపలికి తోపుకున్నాడు. ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగింది ఏమిటి అనేది చూద్దాం.

తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో జింగ్హువా‌లో నివసిస్తున్న ఓ వ్యక్తికి తీవ్రమైన మలబద్ధకం సమస్య ఉంది. ఉద‌యం ఎంతో ముక్కుతున్నాడు అయినా ఈ స‌మ‌స్య పోవ‌డం లేదు. ఏం చేయాలో అర్దం కాని ప‌రిస్దితి. అనేక ర‌కాల మందులు వాడాడు. ఈల్ చేప ద్వారా మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చని ఎవ‌రో చెబితే తెలుసుకున్నాడు. ఇక వెంట‌నే బ‌తికి ఉన్న ఈల్ చేప‌ని తీసుకువ‌చ్చి
మలద్వారంలోకి తోపుకున్నాడు.

అదిపేగుల ద్వారా అతడి పొత్తికడుపులోకి చేరింది. దీంతో అతడు నొప్పితో నరకం చూశాడు. ఇక ఏం చేయాలో తెలియ‌క నొప్పితో ఇంట్లో ఉన్నాడు. వెంట‌నే స్ధానికులు ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు. చివ‌ర‌కు వైద్యులు స‌ర్జ‌రీ చేయాల్సి వ‌చ్చింది. అత‌ను ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నాడు