తల్లి ఇంటి నుంచి బయటకు వెళ్లింది – కుమార్తె ఫోన్ చేసి షాకింగ్ విషయం చెప్పింది

The mother flew out of the house-The daughter called and said the shocking thing

0
99

ఆ ఇంటి ఇల్లాలు పక్క ఇళ్లల్లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అలాగే మొన్న కూడా ఇంటి నుంచి పనికి వెళ్లింది. కాసేపటికి కూతురి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కూతురు చెప్పింది విని పరుగు పరుగున ఇంటికి వచ్చింది తల్లి.
గుణ ప్రాంతానికి చెందిన మమతా బాయి అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఓ కాలనీలో నివసిస్తోంది. కొద్ది రోజులుగా ఎదురు ఇంట్లో ఉన్న బికీ రజక్ తో వారికి గొడవలు జరుగుతున్నాయి.

మధ్యాహ్నం మమతా బాయి పనిలోకి వెళ్లి పోయిన తర్వాత బికీ మరో ముగ్గురితో కలిసి ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. వారి కుమార్తెలని కొట్టాడు. చివరకు పెద్ద కుమార్తె తల్లికి ఫోన్ చేసి చెప్పింది .వెంటనే అక్కడకు పరుగున వెళ్లింది.
మమతపై బికీ గొడ్డలి తీసి ఆమెపై దాడికి తెగబడ్డాడు. చేయి కాలుపై గొడ్డలితో దాడి చేసి బయటకు వెళ్లిపోయాడు.

వెంటనే ఇరుగుపొరుగా వారు హాస్పిటల్కు తరలించారు. బికీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వీరి మధ్య ఎందుకు ఇలా గొడవలు జరుగుతున్నాయి . అసలు ఏమైంది ఈ విషయాలు అన్నీ కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.