కూతురు అడ్మిషన్ కోసం తల్లి స్కూల్ కి వచ్చింది – హెడ్మాస్టర్ ఆమెని ఏం చేశాడంటే

The mother who came to the school for the daughter's admission

0
92

మంచిగా చదువులు చెప్పి విద్యాబుద్దులు నేర్పాల్సిన కొంద‌రు టీచర్లు తప్పలు చేస్తున్నారు. ఇలాంటి కొందరి వల్ల మంచి టీచర్లకు కూడా చెడ్డ పేరు వస్తోంది. ఓ హెడ్మాస్టర్ చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు. ఇదేం పనయ్యా అని అందరూ అతన్ని నిందిస్తున్నారు. క‌ర్నాట‌క‌లో ఓ మహిళ తన చిన్నారికి అడ్మిషన్ కోసం నగరంలోని పాఠశాలకు వచ్చింది. తనకు మసాజ్ చేయాలని ఆ మహిళను ఒత్తిడి చేశాడు ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడు లోకేశప్ప.

బ్యూటీపార్లర్ నడుపుతున్న ఆ మహిళ తన కూతురు కోసం అడ్మిషన్ కోసం అక్కడకు వచ్చిన స‌మ‌యంలో, ఆమె చేసే పని తెలుసుకుని అతను మసాజ్ చేయమని అడిగాడు. లోకేశప్ప టీచర్లందరినీ బయటకు పంపించి, క్లాస్ రూమ్ లో ఒకచోట చొక్కాను తీసివేసి మసాజ్ చేయించుకున్నాడు. ఈ మాస్టార్ చేసే పనిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చివరకు ఇది పెను వైరల్ అయింది.

వెంటనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలో జరిగింది ఈ ఘటన. ఈ విషయం తెలిసిన అందరూ ఇదేం పనయ్యా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా అతనిపై ఆరోపణలు ఉన్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి.