బ్రేకింగ్: ప్రేమ వివాహం చేసుకున్న యువకుడి హత్య

0
98

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏడాది క్రితం నారాయణరెడ్డి అనే యువకుడు ఓ యువతిని ప్రేమపెళ్లి చేసుకున్నాడు. కానీ ప్రేమపెళ్లి ఇష్టం లేక తల్లిదండ్రులు యువతిని ఇంటికి తీసుకెళ్లడంతో పాటు యువతి బంధువు శ్రీనివాస్‌రెడ్డి నారాయణరెడ్డిని బెదిరించాడు. అనంతరం జూన్‌ నెల 30న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నారాయణరెడ్డి అదృశ్యమయినట్టు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫు చేయగా..జిన్నారం అటవీ ప్రాంతంలో  నారాయణరెడ్డి మృతదేహం గుర్తించారు. ఈ హత్య యువతి బంధువులు చేసి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.