కలకలం: రోడ్డు పక్కన వ్యక్తి తల, రెండు వేర్వేరు చేతులు..మొండెం మాయం..

0
103

తెలంగాణలో దారుణ ఘటన వెలుగు చూసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం కుందనపల్లిలో రాజీవ్ రహదారి పక్కన ఓ వ్యక్తి తల, రెండు వేర్వేరు చేతులు కనిపించాయి. అటుగా వెళ్తున్న స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం కాజిపల్లి గ్రామానికి చెందిన శంకర్​గా గుర్తించారు. అతని మృతి ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.