ప్రేమకథ విషాదాంతం-కలిసి బతకలేక..విడిపోయి ఉండలేక

0
96

ఏపీలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం అడవి కొడియంబేడు గ్రామంలో అరుణా నది ఒడ్డున ప్రేమజంట ఆత్మహత్య కలకలం రేపింది. ఆది ఆంధ్ర కులానికి చెందిన అబ్బాయి గుర్రప్ప (26) అమ్మాయి అడవి శంకరాపురంకు చెందిన ఆది ద్రావిడ కులానికి చెందిన అమ్మాయి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వీరిరువురు రెండు రోజుల క్రితం ఇల్లు వదిలి పరారయ్యారు. చివరకు ఈ జంట ఆత్మహత్యకు పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తోంది.