మృతుడి సెల్ఫీ వీడియో కలకలం..ఆ ఇద్దరు యువతులే నా చావుకు కారణం!

0
83

ఏపీలో ఓ యువకుడి సెల్ఫీ వీడియో కలకలం సృష్టించింది. మంగళగిరి మండలం నవులూరు మక్కేవారిపేటలో గత నెల27వ తేదీన సంజయ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన కుమారుడు ఉద్యోగం రాక నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు భావించారు.

తాజాగా ఈ ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజుల తర్వాత సంజయ్ ఫోన్ పరిశీలించగా సంచలన వీడియోలు, సూసైడ్ నోట్ బయటపడడం సంచలనంగా మారింది. తన చావుకు మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లో ఆర్ఎస్ఐగా పనిచేస్తున్న ఎల్లయ్య అలియాస్ రమేష్, గోలి నిరోషా, సుజాత కారణమని వీడియోలో యువకుడు పేర్కొన్నాడు. అంతేకాదు వీరు ఉగ్రవాద సంస్థలకు హెల్పర్లుగా  చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబుతానని నన్ను చంపాలని చూస్తున్నారని వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://www.facebook.com/alltimereport/videos/4987714837964802

తనకు ముఖ్యమంత్రి ఎస్కార్ట్‌లో ఉద్యోగం చేయాలనదే తన జీవిత ఆశయమని, కష్టపడి ఉద్యోగం సంపాదించి తన తల్లిదండ్రులను పోషించాలని ఉందని ఈ వీడియోలో తెలిపాడు. కాగా మృతుని తండ్రి కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.