Flash- అమెరికాలో కాల్పుల కలకలం..తుపాకి పట్టిన 18 ఏళ్ల విద్యార్థి

The shooting frenzy in America

0
87

అమెరికాలో తుపాకి మళ్లీ గర్జించింది. విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ కాల్పులకు కారణమైంది. టెక్సాస్‌లోని అర్లింగ్టన్‌లో జరిగిందీ ఘటన. ఇక్కడి టింబర్ వ్యూ పాఠశాలలో విద్యార్థుల మధ్య ప్రారంభమైన ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకుంది.

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన 18 ఏళ్ల విద్యార్థి కాల్పులు ప్రారంభించగా భయంతో అందరూ పరుగులు తీశారు. ఈ క్రమంలో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

కాల్పులు జరిపిన నిందితుడిని తిమోతీ జార్జ్ సింప్‌కిన్స్‌గా గుర్తించారు. అతడిపై మూడు అభియోగాలు నమోదు చేశారు. కాగా, తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.