మనిషికి ఎవరికైనా శ్వాస అందక కొట్టుమిట్టాడుతుంటే చూసి జాలి పడతాం. వెంటనే వారిని దగ్గరలో ఆస్పత్రికి తీసుకువెళతాం.కొందరు వెంటనే నోట్లో నోరు పెట్టి ఊపిరి ఊది ప్రాణం పోసే ప్రయత్నం కూడా చేస్తారు. అయితే మనుషులకే కాదు జంతువులకి కూడా ఇలా ఊపిరి పోసిన వారు ఉన్నారు అనేది తెలుసా.
ఒక్కోసారి ఇలాంటి ఘటను కూడా జరుగుతూ ఉంటాయి. అయితే కొందరు జంతువే కదా అని పట్టించుకోరు. కాని ఓ వ్యక్తి పాముకి ఊపిరి పోశాడు ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాకు చెందిన స్నేహాశీష్ అనే వ్యక్తి స్థానికంగా పాములను పట్టుకుంటుంటాడు.
ఎలుకను వేటాడుతూ ఓ ఇంట్లోకి దూరిన పాము ఓ కన్నంలో ఇరుక్కుపోయింది. ఆ 10 అడుగుల పామును బయటకు తీశాడు. కానీ, అది అప్పటికే అపస్మార స్థితిలోకి వెళ్లడం గమనించాడు. ఓ స్ట్రా కనపడింది వెంటనే దాన్ని పాము నోట్లో పెట్టి ఊపిరి ఊదాడు. దాదాపు 15 నిమిషాల తర్వాత అది స్పృహలోకి వచ్చింది. మొత్తానికి అతను చేసిన పనికి అందరూ ప్రశంసలు ఇస్తున్నారు.