దారుణం..పెళ్లి చేయడం లేదని తండ్రి గొంతు కోసిన కసాయి కొడుకు

0
121

ఈ మధ్యకాలంలో చిన్నచిన్న కారణాలకు ఎదుటివారి ప్రాణాలను బలితీయడానికి కూడా వెనుకాడడం లేరు కొందరు కామాంధులు. ఎదుటివారు సొంతవాళ్లని కూడా ఆలోచించకుండా కంటిరెప్పపాటిలోనే ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకోగా..నిండు ప్రాణం బలయిపోయింది.

వివరాల్లోకి వెళితే..పింజరి గుట్ట కాలనీకి చెందిన అప్పాల గణపతి ప్రభుత్వ మార్కెట్ కమిటీ ఆఫీస్ లో ఉద్యోగం చేసి ఇటీవలే విరమణ పొందాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉండగా..వారిలో చిన్న కుమారుడైన అన్వేష్ ఎలాంటి పని చేయకుండా తిని, తిరుగుతుంటాడు.

దాంతో ఇంట్లో ఏం చేయాలో తోచక తనకు పెళ్లి చేయమని తండ్రితో ప్రతి రోజు గొడవ పడుతూ ఉండేవాడు. రోజులాగే సోమవారం కూడా వారి మధ్య గొడవ కాస్త పెద్దగా మారి కోపంతో తండ్రి గణపతి మెడమీద కొడవలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దాంతో ఈ ఘటనపై కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.