Flash- పోలీసుల ముందుకు కేంద్ర మంత్రి కుమారుడు

The son of a Union Minister before the Crime Branch police

0
88

యూపీలోని లఖింపుర్ ఘటన విచారణలో భాగంగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్​ మిశ్రా లఖింపుర్ క్రైమ్ బ్రాంచ్​ పోలీసుల ఎదుట శనివారం హాజరయ్యారు. ఈ కేసులో పోలీసులు అతడ్ని ప్రశ్నించనున్నారు.

అంతకుముందు.. ఆశిష్​ మిశ్రాను శుక్రవారం ఉదయం 10 గంటలకు హాజరుకావాలని ఆదేశించగా.. ఆయన గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో అతనికి పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. దాంతో అతను శనివారం లఖింపుర్​ క్రైమ్ బ్రాంచ్​ పోలీసుల ముందు హాజరయ్యారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై ఆశిష్ మిశ్రాకు చెందిన వాహన శ్రేణి దూసుకెళ్లింది. ఆ ఘటనలో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఈ కేసుకు సంబంధించి ఆయన నేడు పోలీసుల ముందుకు వచ్చారు. విచారణ అనంతరం పూర్తి విషయాలు వెలువడే అవకాశం ఉంది.