ఏపీలో దారుణం..ఆస్తికి ఆశపడి కన్నతండ్రిని హతమార్చాలని చూసిన కసాయి పిల్లలు

0
135

ఈ మధ్య కాలంలో చిన్నచిన్న కారణాల వల్ల కోపంతో క్షణాల్లోనే ప్రాణాలు బలితీయడానికి కూడా వెనుకాడడం లేరు కొందరు కామాంధులు. ముఖ్యంగా ఆస్తికి ఆశపడి తల్లితండ్రులను కంటిరెప్పపాటిలోనే హతమార్చిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనే ఓ నిండు ప్రాణాలమీదికి తెచ్చింది.

కుర్లపల్లికి చెందిన నారాయణ స్వామికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా..వీళ్ళ జీవితాలు సాఫీగా సాగిపోతున్నాయి. అయితే ఈ క్రమంలో వారి జీవితాలలో ఆస్థి అనే మాట చిచ్చులేపింది. ఇది కాస్త పెద్ద వివాదంగా మారి  గొడ్డలితో దాడి చేయడానికి కూడా దారితీసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..ఆస్తి కోసం కన్న తండ్రి పైనే ఒక కుమారుడు, కుమార్తె హత్యాయత్నానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం కుర్లపల్లి లో చోటుచేసుకుంది.

వారి పిల్లలు తమ తండ్రిని ఆయన పేరిట ఉన్న ఆస్తి రాసి ఇవ్వాలని కోరగా దానికి నిరాకరించాడు. దాంతో కోపంతో ఆయన కళ్లలో కారం కొట్టి గొడ్డలిని తిప్పేసి తలపై కొట్టి హత్యాయత్నం చేశారు. ఇది గమనించిన స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలియజేసారు. దాంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించారు.