విద్యార్థినిపై కీచక ఉపాధ్యాయుడు దారుణం

0
85

ఏపీ: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే వక్రబుద్ధి ప్రదర్శించాడు. భావిపౌరులకు నైతిక విలువలు తెలియజెప్పాల్సింది పోయి..తనే అనైతిక చర్యలకు పాల్పడ్డాడు. పాఠాలు చెబుతానంటూ పాఠశాలకు వచ్చిన విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కీచక పర్వానికి తెర తీశాడు. గుంటూరు జిల్లాలో జరిగింది ఈ దారుణం. వివరాల్లోకి వెళితే..పిడుగురాళ్ల పట్టణంలోని భానొదయ పబ్లిక్ స్కూల్ లో కీచక ఉపాధ్యాయుడు నీచానికి దిగజారాడు. అదే పాఠశాలలో చదువుతున్న పద్నాలుగు సంవత్సరాల బాలికను రూమ్ లోకి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక కుటుంబ సభ్యులకు చెప్పడంతో..ఆవేశానికి గురైన బంధువులు కీచక ఉపాధ్యాయుడును చొక్కా పట్టుకొని ఈడ్చుకొని పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.