పోలీసులు అవమానించారని విద్యార్థి ఆత్మహత్యాయత్నం

0
127

ఆంధ్రప్రదేశ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు అత్యుత్సాహం కారణంగా ఓ విద్యార్థి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వీరవల్లి పోలీసులకు కోడూరుపాడు గ్రామంలో కోడి పందాలు వేస్తున్నారనే సమాచారం తెలియడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు.

అనంతరం అక్కడ ఉన్న వారిపై ఆకస్మికంగా దాడి చేయడంతో..అక్కడే దగ్గరలో ఉన్న వసంత కుమార్ అనే విద్యార్థిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత పోలీసుల ఆనందం కోసం స్టేషన్ కి తరలించకుండా గ్రామం మధ్యలో నాలుగు రోడ్డుల కూడలిలో మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కోడిని ముందు పెట్టి ఫోటోలు తీయడంతో అవమానంగా భావించిన విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉండడానికి వీరవల్లి పోలీసులు కారణమని అబ్బాయి తల్లి లక్ష్మీ వాపోయింది.