పైకి మేము మారిపోయాం అని చెబుతున్నారు తాలిబన్లు కాని వారి విధానాలు నిర్ణయాలు కఠిన ఆంక్షలు మాత్రం అందరిని భయానికి గురిచేస్తున్నాయి. అక్కడ ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. లక్షలాది మంది వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నారు. ఆఫ్గనిస్థాన్ నుంచి అమెరికా సేనలు పూర్తిగా వైదొలగడంతో దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు తాలిబన్లు.
మహిళలను దారుణంగా చూస్తున్నారు. దేశంలో కఠినమైన షరియా చట్టాలను అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
తమ దేశంలోని సెక్స్ వర్కర్ల జాబితాను తాలిబన్లు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వారిని ఏం చేస్తారు అనేది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వారికి ఏమైనా శిక్షలు విధిస్తారా ? లేదా వారిని లైంగిక వెట్టి చాకిరీకి వాడుకుంటారా అనేది ఇప్పుడు భయంగా ఉంది.
అడల్ట్ సైట్స్ సాయంతో తమ దేశంలోని సెక్స్ వర్కర్లను వారు గుర్తిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశీయులతో శృంగారంలో పాల్గొన్న ఆఫ్గన్ మహిళలు ఎవరు ఉన్నారా అనేది తెలుసుకుంటున్నారు. 1996 నుంచి 2001 వరకు ఆఫ్గనిస్థాన్లో అధికారంలో ఉన్న తాలిబన్లు పలువురు సెక్స్ వర్కర్లకు బహిరంగ ప్రదేశాల్లో మరణశిక్ష అమలు చేశారు. ఎవరైనా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే వారికి మరణి శిక్ష విధిస్తారు.