అఫ్ఘానిస్తాన్లో తాలిబన్లు ముందు శాంతి వచనాలు చెప్పారు కాని ఇప్పుడు మాత్రం తమ అసలు రంగు బయటపెడుతున్నారు. తాము చెప్పింది చేయాల్సిందే మా రూల్స్ పాటించాల్సిందే అని అంటున్నారు. మహిళల హక్కులను గౌరవిస్తామని ప్రకటించిన మరుసటి రోజే హెరాత్ ప్రావిన్స్ లోని యూనివర్సిటీల్లో కో-ఎడ్యుకేషన్ పై బ్యాన్ విధించారు. దీనిని అక్కడ మహిళలు ఇదేం నిర్ణయం అని తీవ్రంగా విమర్శిస్తున్నారు. తమ జీవితాలు ఏమవ్వాలని కన్నీరు పెడుతున్నారు.
కానీ తాలిబన్లు మాత్రం ఈ సమాజంలో అన్ని చెడులకూ మూలం కో-ఎడ్యుకేషనే అంటూ చెబుతున్నారు. యూనివర్సిటీల్లో ఉండే ప్రొఫెసర్లు, ప్రైవేటు వర్సిటీ ఓనర్లతో తాలిబన్ నేతలు చాలా సేపు మాట్లాడారు. కో-ఎడ్యుకేషనే పై తాలిబన్లు ఫత్వా జారీ చేశారు. కో-ఎడ్యుకేషన్ పై నిషేధం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని అఫ్గనిస్థాన్ విద్యాధికారి చెబుతున్నారు.
ఉమెన్ ప్రొఫెసర్లను టీచింగ్ కు మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు. దీంతో చాలా మంది అమ్మాయిలు చదువుకి దూరం అవుతారు అని అంటున్నారు విద్యా వేత్తలు. ఇక ప్రైవేట్ వర్శిటిలకు ఇది చాలా ఇబ్బంది అంటున్నారు విద్యావేత్తలు.