ప్రస్తుత రోజుల్లో చోరీలు మరింత అధికం అవుతున్నాయి. వాస్తవానికి దొంగతనం అనేది చట్టవిరుద్ధమైన పని. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న దొంగల్లో మార్పు రావడం లేదు. అలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో చోటుచేసుకుంది.
జామి ఎల్లమ్మ దేవాలయంలో దొంగతనం చేసేందుకు కంచిలికి చెందిన రీస్ పాపారావు అనే వ్యక్తి వచ్చాడు. దేవాలయంలో అమ్మవారి వస్తువులను దొంగతనం చేశాడు. కానీ తిరిగి బయటపడేందుకు గోడ కన్నం నుంచి వెళ్తుండగా అందులో ఇరుక్కుపోయాడు. దాంతో గ్రామస్తులు అతనిని పట్టుకొని కంచిలి పోలీసులకు అప్పగించారు. చివరకు ఆ కన్నం వల్ల పోలీసులకు గజదొంగ దొరికాడు.
వీడియో చూడాలంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి
https://www.facebook.com/alltimereport/videos/4958733697576329