కర్రతో పాటు టీఆర్ఎస్ జెండా ఎత్తుకెళ్లిన దుండగులు..ఎక్కడో తెలుసా?

0
84

దొంగలు సాధారణంగా డబ్బులు, నగలు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్తుంటారు. కానీ తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లాలో వెరైటీ దొంగతనం చేసుకుంది. కొందరు దుండగులు పరిగి మున్సిపల్ పరిధిలోని మల్లేమోని గూడలో టిఆర్ఎస్ జెండాను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది.

జెండా కర్రతో పాటు జెండాను దుండగులు ఎత్తుకెళ్ళగా..టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దుండగుల కోసం డాగ్‌ స్క్వాడ్‌ని రంగంలోకి దించారు పోలీసులు. గల్లిల్లో డాగ్ స్క్వాడ్ కుక్కలు తిరుగుతుంటే అక్కడున్న జనాలు ఆశ్చర్యానికి లోనయ్యారు. పెద్ద పెద్ద దొంగతనాలు, మర్డర్ లు అయితే పట్టించుకకోని పోలీసులు అధికార పార్టీ జెండా పోతే తొందరగా స్పందించారని స్థానికంగా గుసగుసలాడారు.