ఏపీ: శ్రీకాకులం జిల్లా రామచంద్రాపురంలో కాల్పుల కలకలం రేగింది. సర్పంచ్ పై ఇద్దరు వ్యక్తులకు కాల్పులకు తెగబడ్డారు. రామచంద్రాపురం సర్పంచ్ వెంకటరమణ వద్దకు మంగళవారం రాత్రి ఓ మహిళ వచ్చింది. మధురానగర్ లోని సర్పంచ్ కార్యాలయం వద్ద వెంటకరమణ ఉండగా ఆయన వద్దకే వెళ్లింది. ఆమెతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా సర్పంచ్ దగ్గరకు వెళ్లారు.
కాగా మహిళ సర్పంచ్ తో మాట్లాడుతున్న క్రమంలో అదును చూసుకుని ఆమె వెంట వచ్చిన ఇద్దరూ కాల్పలకు తెగబడ్డారు. దాంతో సర్పంచ్ కు తీవ్రగాయాలు అయ్యాయి. కాల్పులు జరిపిన వెంటనే దుండగులు అక్కడ నుండి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.