చిన్నారిని రేప్ చేసిన దుర్మార్గుడు – చిన్న క్లూ కూడా లేదు – రంగంలోకి 700 మంది పోలీసులు

The villain who raped the child

0
79

అభం శుభం తెలియని చిన్నారులని ఈ కామాంధులు వదలడం లేదు. ఇలాంటి వారిని నడి రోడ్డుపై ఉరి తీయాలి అప్పుడే ఇలాంటి పని చేయాలంటే ఎవరికైనా భయం వణుకు వస్తుంది అంటున్నారు జనం. రాజస్థాన్లోని జైపూర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామం అక్కడ సురేష్ కుమార్ అనే వ్యక్తి 4 ఏళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లాడు. అక్కడ నుంచి చెరువు దగ్గరకి ఆమెని తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు.

చివరకు ఆమెను హత్య చేశాడు. ఆ చిన్నారి శవం చూసి పెద్ద ఎత్తున గ్రామస్తులు కుటుంబం సభ్యులు పోలీస్ స్టేషన్ కు చేరుకుని నిందితుడ్ని పట్టుకోవాలి అని కోరారు. అతను సెల్ ఫోన్ వాడటం లేదు దీంతో అతని ఆచూకి తెలియడం కష్టం అయింది.
700 మంది పోలీసులు రంగంలోకి దిగారు.

పోలీసులు తన గురించి వెతుకుతున్నారు అని నిందితుడికి తెలిసింది. దీంతో నిందితుడు ఒక చోట నుంచి మరో చోటికి మూవ్ అవుతున్నాడు. చివరకు ఇలాంటి దారుణాలు చేసిన వాడు దొరకాల్సిందే, వీడి పాపం పండింది స్థానికంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ల ద్వారా అతని కదలికలపై ఫోకస్ పెట్టారు 24 గంటల్లో దొరికాడు.