24 ఏళ్ల తర్వాత కుమారుడి ఆచూకీ లభ్యం – ఆ తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడంటే

ఓ తండ్రి తప్పిపోయిన తన కుమారిడి కోసం సుమారు 5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాడు

0
104

చైనా దేశంలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఓ తండ్రి తప్పిపోయిన తన కుమారిడి కోసం సుమారు 5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాడు. చివరకు 24 ఏళ్ల తర్వాత కుమారుడి ఆచూకీ చిక్కింది. ప్రపంచంలో బహుశా ఇలా జరగడం ఇదే తొలిసారి. పిల్లలపై తల్లిదండ్రులకి ఎంత ప్రేమ ఉంటుందో తెలిసిందే. ఒక్క క్షణం కనిపించ5కుండా పోతే మనం అస్సలు తట్టుకోలేం.

అలాంటిది 24 ఏళ్లు తన బిడ్డ కనిపించక అతను ఎంత క్షోభ అనుభవించాడో అర్దం చేసుకోవచ్చు. చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్సులో జరిగింది ఈ ఘటన. గువా గాంగ్టాంగ్ కుమారుడు రెండేళ్ల వయసులో కిడ్నాప్ కు గురయ్యాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో ఆ పిల్లవాడిని ఎత్తుకెళ్లారు. వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే ఇద్దరు అనుమానితుల్ని అరెస్ట్ చేశారు.

నిజానికి తన కుమారుడి కోసం గువా గాంగ్టాంగ్ దాదాపు 20 ప్రావిన్సుల్లో తిరిగాడు. 1997లో రెండేళ్ల వయసులో పిల్లవాడు అపహరణకు గురయ్యాడు. అప్పటి నుంచి కొడుకు కోసం అతను దేశమంతా ప్రయాణించాడు. గువా గాంగ్టాంగ్ కు జరిగిన ఘటనై సినిమా కూడా తీశారు 2015 లో. ఇక ప్రతీ ఏడాది చైనాలో 20 వేల మంది చిన్నారులు ఇలా కిడ్నాప్ కు గురి అవుతున్నారు. చైనాలో ఇంటిలో ఒంటరిగా పిల్లల్ని అస్సలు వదిలివెళ్లరు. ఇక కొడుకు దొరకడంతో అతను చాలా ఆనందంలో ఉన్నాడు.