Breaking News- హీరోయిన్ ఐశ్వర్యారాయ్‌కి ఈడీ స‌మ‌న్లు

The whole summons to the heroine Aishwarya Rai

0
83

ప్రముఖ సినీ నటి ఐశ్వ‌ర్యా రాయ్ బ‌చ్చ‌న్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) నుంచి నోటీసులు అందాయి. పనామా ప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారంలో ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ రోజు ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాల‌యానికి వ‌చ్చి, తమ ఎదుట విచార‌ణ‌కు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది.

అయితే, తాను ఈ రోజు విచార‌ణ‌కు రాలేన‌ని, విచార‌ణ‌ను మ‌రో తేదీకి మార్చాల‌ని ఐశ్వ‌ర్యా రాయ్ ఈడీని కోరిన‌ట్లు తెలిసింది. దీనిపై ఈడీ స్పందించాల్సి ఉంది. ఐశ్వ‌ర్యా రాయ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ గ‌తంలోనూ స‌మ‌న్లు జారీ చేయ‌గా, ఆమె రెండు సార్లు విచార‌ణ తేదీల‌ను మార్చాల‌ని కోరిన‌ట్లు తెలిసింది. ఇప్ప‌టికే ఐశ్వ‌ర్య భ‌ర్త‌ అభిషేక్‌ బచ్చన్‌కు కూడా ఈడీ సమన‍్లు జారీ చేసి, విచారించిన విష‌యం తెలిసిందే.