మల్లెపూలు తేవట్లేదని భర్తను చంపిన భార్య – ఈ స్టోరి వింటే మతిపోతుంది

The wife who killed her husband for not bringing jasmine

0
96

దేవీసింగ్ అనే వ్యక్తి రాజస్థాన్ భిల్వారా జిల్లాలో బలపురాలో పశువుల దాణా వ్యాపారం చేస్తున్నాడు. అతని భార్య పింకీతో చాలా సంతోషంగా కాపురం చేసుకుంటున్నాడు. అయితే ఓరోజు ఉదయం ముగ్గురు వ్యక్తులు అతని ఇంటికి వచ్చి అతనిని నరికి చంపేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. దేవీసింగ్ కు ఎవరైనా శత్రువులు ఉన్నారేమో అనే డౌట్ వచ్చి ఆ కోణంలో దర్యాప్తు చేశారు.

అతను అందరితోనూ బాగానే ఉంటాడు. అతనికి ఎవరూ శత్రువులు లేరని తేలింది. ఇక పోలీసులు భార్య పై అనుమానంతో ఆమె గురించి విచారణ చేశారు. మహిళా పోలీసులు పింకిని తమదైన శైలిలో విచారణ చేశారు. అప్పుడు అసలు నిజం చెప్పింది.తన భర్త హత్య కోసం ముగ్గురు కిరాయి రౌడీలకు సుపారీ ఇచ్చానని తెలిపింది. అయితే ఎందుకు చంపించావు అంటే మల్లెపూలు తేవడం మానేసినందుకు అని చెప్పింది.

తరచూ మల్లెపూలు తెచ్చి ఆమెని సంతోషంగా చూసుకునే భర్త ఈ మధ్య చాలా మారిపోయాడు. పూలు తేవడం లేదు ఇంటికి సరిగ్గా రావడం లేదు . తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని బలంగా నమ్మింది. దీంతో పింకీ చెల్లెలి కూతురి భర్త కులదీప్ సింగ్ ని పిలిచి మర్డర్ స్కెచ్ వేసింది. ముగ్గురు కలిసి ఆగస్ట్ 22న ప్లాన్ అమలు చేశారు. చివరకు భర్త చనిపోయాడు, ఆమె జైలు పాలైంది, మరో ముగ్గురిని కటకటాల పాలు చేసింది.