ప్రియుడి సాయంతో భర్తని చంపి స్టేషన్ కు వచ్చి లొంగిపోయిన భార్య – చివరకు

The wife who killed her husband with the help of Lover and came to the station and surrendered

0
83

ఓ పెద్దాయన పోలీస్ స్టేషన్ కి వచ్చి సార్ నా కొడుకు కోడలు మనవడు కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇచ్చాడు. అసలు ఏమైంది అని పోలీసులు అతనిని అన్ని వివరాలు అడిగి తెలుసుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ సమయంలో అతని కోడలు పోలీస్ స్టేషన్ కు వచ్చింది. తన భర్తను చంపేశాను అని తెలిపింది ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

తమిళనాడులోని కాంచీపురం జిల్లా సోమంగళం అదానంచెరి, తిరుమకల్ నగర్ ప్రాంతంలో తంగవేల్
నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య కొడుకు ఉన్నారు, అతను ఓ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాడు.
తంగవేల్ సోదరుడు శక్తివేల్ అతడికి కొద్ది రోజుల క్రితం ఫోన్ చేశాడు అయితే ఫోన్ లిఫ్ట్ చేసిన తంగవేల్ భార్య విమలారాణి తన కొడుకు ఆన్ లైన్ క్లాసులు వింటున్నాడని చెప్పి ఫోన్ కట్ చేసింది. మళ్లీ కొన్ని రోజులకి ఫోన్ చేస్తే ఫోన్ స్విఛ్చాఫ్ అని వచ్చింది.

ఈ సమయంలో తండ్రి అనుమానంతో కేసు పెట్టాడు. ఇక కేసు పెట్టిన తర్వాత అతని భార్య స్టేషన్ కు వచ్చింది. తన భర్తతో మొన్న వాగ్వాదం జరిగింది. చివరకు మెడపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్టుగా చెప్పింది. ఆ తర్వాత మృతదేహాన్ని బెడ్రూమ్ లో రాత్రి 10 గంటల వరకు ఉంచానని తర్వాత తన ప్రియుడు రాజాతో కలిసి సరస్సులో పడేశామని తెలిపింది. ఇంత‌కీ ఏం జ‌రిగింది అనేది పోలీసుల విచార‌ణ‌లో తెలియ‌నుంది.