తెలంగాణాలో దారుణ ఘటన..కన్నబిడ్డను కిరాతంగా చంపిన తండ్రి

0
115

ఈ మధ్యకాలంలో చిన్న చిన్న కారణాలకు కోపంతో ప్రాణాలను బలితీయడానికి కూడా వెనుకాడడం లేరు కొందరు కామాంధులు. తాజాగా ఇలాంటి ఘటనే మహబూబ్​నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో కన్నాతండ్రి కూతురు, భార్య ప్రాణాలను బలితీయడంతో పాటు తనప్రాణాలను తాను సైతం బలితీసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే..మహబూబ్​నగర్ జిల్లా జైనల్లీపూర్ గ్రామానికి చెందిన కృష్ణయ్యకు ఒక సరస్వతి అనే కూతురు ఉండగా..ఈనెల 8న మహబూబ్​నగర్ జిల్లా కేంద్రానికి చెందిన వరుడితో వివాహం వివాహం అంగరంగవైభవంగా జరిపించారు. అనంతరం 15 రోజల తర్వాత ఆమె తల్లిగారింటికి వచ్చి తిరిగి కాపురానికి వెళ్లబోనంటూ తల్లిదండ్రులకు చెప్పడంతో తండ్రి ఆగ్రహం వ్యక్తం చేసాడు.

దాంతో  కృష్ణయ్య తల్లికూతుళ్లిద్దరినీ కర్రతో మోది దారుణంగా హత్య చేశాడు. తాను కూడా విషగుళికలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.  దాంతో స్థానికులు ముగ్గురిని హుటాహుటిగా హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే తల్లికూతుళ్లిద్దరి ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం కృష్ణయ్యకు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.