తెలంగాణ: జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీట్ బజార్‌లో దారుణం జరిగింది. హనుమాన్ వాడకు చెందిన రౌడీషీటర్ తోట శేఖర్ దారుణ హత్యకు గురయ్యాడు. నిన్న రాత్రి బీట్ బజార్‌లోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద తోట శేఖర్ ఉన్నాడు. శేఖర్‌కు మద్యం తాగించిన కొందరు వ్యక్తులు..ఆ తర్వాత అతనిపై కత్తితో దాడి చేసి హత్య చేశారు.
ఈ ఘటనకు పాత కక్షలే కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శేఖర్‌పై గతంలోనూ ఒకసారి హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శేఖర్‌పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.