ప్రియురాలి పెళ్లి..మండపంలోనే నిప్పంటించుకున్న యువకుడు

0
105
Kabul

హైదరాబాద్ లో ఘోరం జరిగింది. ప్రేమించిన అమ్మాయితో తనకు పెళ్లి జరగలేదని మనస్తాపంతో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ లంగర్ హౌస్ లో ప్రియురాలికి వేరొకరితో పెళ్లి జరుగుతుంది.

ఈ విషయం తెలుసుకున్న యువకుడు పెళ్లి మండపానికి వెళ్ళాడు. ప్రియురాలి పెళ్లిని తట్టుకోలేక పెళ్లి మండపంలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అంతేకాక మంటల్లో వధువును హత్తుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన బంధువులు వెంటనే వధువుని పక్కకు జరిపారు. దానితో ప్రమాదం తప్పింది. తీవ్ర గాయాలపాలైన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.