నెమలి ఢీకొని యువకుడు మృతి..ఊహించని చావు

The young man was killed when the peacock collided

0
157

కర్ణాటకలో నెమలి ఢీకొని యువకుడు మృతి చెందాడు. వినడానికి షాక్ గా ఉన్నా ఇది నిజం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన అబ్దుల్లాకు 24 సంవత్సరాలు. అతను మొబైల్ షాపులో పని చేస్తున్నాడు. 2 రోజుల క్రితం తన గ్రామం నుంచి షాపుకు బయల్దేరాడు. స్కూటీ పై వెళ్తుండగా ఓ నెమలి రోడ్డు వెంట అటు నుంచి ఇటు ఎగురుతూ దూకబోయింది. ఎగురుతున్న సమయంలో స్కూటీ పై ఉన్న అబ్దుల్లా తలకు తగిలింది. దీంతో బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్ కు అబ్దుల్లా తల బలంగా ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. నెమలి కూడా ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించింది.

ఊహించని రీతిలో అబ్దుల్లా మరణించడంతో అక్కడ విషాదచాయలు నెలకొన్నాయి. ఈ ఘటనపై పుదుబిద్రి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. నెమళ్ల వల్ల ఈ ప్రాంతంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.