పెళ్లి చేసుకుందామనుకుంది- చివరకు యువకుడి ట్విస్ట్

The young man who cheated on the young woman

0
117

మ్యాట్రిమోనీని పెళ్లి సంబంధాలకు వేదిక అని అందరూ భావిస్తారు. అబ్బాయి, అమ్మాయిలు మాట్రిమోనీలోని వివరాలు చూసి తమకు సరైన జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. కానీ కొంతమంది కేటుగాళ్లు దీనిని ఆసరాగా చేసుకొని అమ్మాయిలను తమ వలలో వేసుకొని వారి జీవితాలను ఆగం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. సుభాష్ అనే వ్యక్తి ఓ అమ్మాయికి ఫోన్ చేసి నీ వివరాలు చూసాను. చాలా బాగా నచ్చావు. పెళ్లి చేసుకుందాం అంటూ మాయ మాటలు చెప్పాడు.

తరచూ ఫోన్ లో మాట్లాడుకుంటూ..ఒకసారి కలవాలి మాదాపూర్ కు రమ్మన్నాడు. అతని మాటలను గుడ్డిగా నమ్మిన ఆ యువతి ఏప్రిల్ 27న మాదాపూర్ కు వెళ్ళింది. ఇద్దరు కలిసి ఓ రెస్టారెంట్ లో భోజనం చేసాక ఆ అమ్మాయిని తన రూమ్ కు తీసుకెళ్లి ఏకాంతంగా గడిపిన క్షణాలను ఫోటోలు, వీడియోలు తీశాడు. కొద్ది రోజులకు ఆ వీడియోలు నెట్ లో ప్రతక్షం అవ్వడంతో యువతి షాక్ తింది.

దీనితో ఏమి చేయాలో తెలియక ఆ యువతి సుభాష్ కు ఫోన్ చేసింది. డబ్బులు ఇవ్వాలని లేకుంటే నీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. చేసేది ఏమి లేక ఆ యువతి అతను అడిగిన డబ్బులు ఇచ్చింది. కానీ అతను వీడియోలు డిలీట్ చేయకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది.