ఏపీ: గుంటూరులో దారుణం జరిగింది. ఓ ల్యాబ్ కి ఈసీజీ కోసం వచ్చిన యువతి పట్ల టెక్నీషియన్ అసభ్యకరంగా ప్రవర్తించి ఆమె చిత్రాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఈసీజీ తీయాలంటే దుస్తులు విప్పాలని యువతికి సూచించాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. దుస్తులు తీయకుంటే రిపోర్ట్స్ సరిగా రావని ఇష్టం లేకుంటే వెళ్లిపోవాలని గట్టిగా అరవడంతో చేసేది లేక ఆమె దుస్తులు విప్పింది.
యువతి సిగ్గుతో కళ్లు మూసుకోగా..బల్లపై పడుకోమని చెప్పి ముబైల్ లో ఫోటోలు తీశాడు. అయితే పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి హరీష్ అసలు టెక్నీషియనే కాదని ఆసుపత్రి ఉన్నతాధికారులు వెల్లడించారు. అసలు టెక్నీషియన్ శంకర్ అనారోగ్యం బారిన పడటంతో అతని స్థానంలో హరీష్ అనే వ్యక్తి పని చేస్తున్నట్లు తెలుస్తుంది.