ఖమ్మం జిల్లాలో పట్టపగలే చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే గరిడేపల్లి మండలం పరిధిలోని కీతవారిగూడెం గ్రామానికి చెందిన జుట్టుకొండ లక్ష్మీనర్సయ్య అనే అతడి ఇంట్లో తేది 30.09.2016 రోజు మధ్యాహ్నం ఎవ్వరూ లేని సమయంలో గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో నుండి విలువైన బంగారు, వెండి వస్తువులను దొంగిలించారు.
Cr.No.207/2016 U/s 454,380 IPC ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి పరిశోధనలో నేరస్తుల జాడ తెలియనందున కేసును క్లోజ్ చేశారు. అట్టి కేసులో హుజూరునగరు ఐ.డి. పార్టీ సిబ్బంది అజిత్ రెడ్డి, నాగరాజు, శంబయ్యలు, నాగిరెడ్డిలు ఇట్టి కేసులో నేరస్థుని ఆచూకీ తీసి ఎంతో చాకచక్యముగా వ్యవహరించి ఈ కేసులో నేరస్థుడు కల్లూరు గ్రామానికి చెందిన కొమ్మనబోయిన సీతారాములు అనే అతడిని పట్టుకున్నారు.
అతని వద్ద నుండి 4.9 తులాల బంగారు వస్తువులు, 30 తులాల వెండి వస్తువులను రికవరీ చేసి ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్ట్ నందు హాజరుపరచారు. ఈ కేసును ఎంతో చాకచక్యముగా ఛేదించిన ఐ.డి పార్టీ సిబ్బంది అజిత్ రెడ్డి, నాగరాజు, శంబయ్యలు, నాగిరెడ్డిలను సి.ఐ రామలింగారెడ్డి అభినందించారు.