ఆర్యన్ బెయిల్ కి షరతులు ఇవే..

These are the conditions for Aryan bail.

0
113

డ్రగ్స్​ కేసులో అరెస్టయిన షారుక్​ ఖాన్​ తనయుడు ఆర్యన్​ ఖాన్​కు గురువారం బెయిల్​ లభించింది. 14 షరతులతో కూడిన బెయిల్​ ఆర్డర్​ను శుక్రవారం జారీ చేసింది కోర్టు. ఆర్యన్​తో పాటు అర్బాజ్​ మర్చంట్​, మున్మున్​ ధమేచాకు కూడా బెయిల్​ లభించింది. క్రూయిజ్​ షిప్​పై దాడి చేసి ఎన్​సీబీ వీరిని 25 రోజుల కింద అరెస్టు చేసింది.

రూ. లక్ష రూపాయల పర్సనల్​ బాండ్​తో పాటు..అంతే మొత్తంలో ఒకరు లేదా ఇద్దరి పూచీకత్తు సమర్పించాలని స్పష్టం చేసింది కోర్టు. 5 పేజీల బెయిల్​ ఆర్డర్​పై జస్టిస్​ ఎన్​డబ్ల్యూ సాంబ్రే శుక్రవారం మధ్యాహ్నం సంతకం చేశారు.

బెయిల్​ షరతులు ఇవే..

రూ. లక్ష పర్సనల్​ బాండ్​

ఒకరు లేదా ఇద్దరి పూచీకత్తు

ప్రత్యేక కోర్టుకు పాస్​పోర్ట్ అప్పగించాలి.​

కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదు.

మళ్లీ ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడకూడదు.

సహ నిందితులతో మాట్లాడటం, కలవడం చేయకూడదు.

ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 11-2 గంటల సమయంలో..ముంబయి ఎన్​సీబీ కార్యాలయానికి రావాలి.

విచారణను ఆలస్యం చేసేలా ప్రవర్తించకూడదు.

ఈ షరతులను ఆర్యన్ ఉల్లంగిస్తే బెయిల్ రద్దుకు ఎన్సీబీ అధికారులు కోర్టును కోరవచ్చు.