ఈ భూమి మీద అత్యంత విషపూరిత పాములు ఇవే

These are the most venomous snakes on earth

0
155

మన భూమ్మీద మనిషితో పాటు అనేక రకాల జంతువులు ఉన్నాయి. ముఖ్యంగా పాముల విషయంలో మనిషి చాలా భయపడతాడు. ఎందుకంటే అవి విషం కలిగి ఉంటాయి కాబట్టి. ఈ భూమ్మీద దాదాపు 4 వేల జాతుల దాకా పాములు ఉన్నాయి. అందులో ఓ 650 జాతులు విషం కలిగినవి ఉంటాయి.

వీటిలో 200 జాతుల పాముల నుంచి మాత్రమే మనిషికి ముప్పు ఉంటోందని తేల్చారు. కానీ చాలా మంది అవేమీ పట్టించుకోకుండా వెంటనే పాము కనిపించగానే చంపేస్తారు. పర్యావరణం కోసం పాములు ఉండాల్సిందే. అందుకే జులై 16న వరల్డ్ స్నేక్ డే ను నిర్వహిస్తున్నారు నిపుణులు.

పాములకు చూపు సామర్థ్యం చాలా తక్కువ. పాము తన కింది దడవ ద్వారా శబ్ద తరంగాలు పసిగడుతుంది. అందుకే మనిషి నడిచినా, జంతువు నడిచినా, ఆ భూమికి తన శరీరం ఆన్చి అది వేగంగా పారిపోతుంది. మరి ప్రపంచంలో అతి విషపూరితమైన పాములు ఏమిటో చూద్దాం.

టైగర్ స్నేక్
ఈస్ట్రన్ బ్రౌన్ స్నేక్..
ఇన్ల్యాండ్ టైపాన్
రస్సెల్స్ వైపర్
బ్లూ క్రాయిట్
బూమ్స్లాంగ్
మోజావే రాటెల్స్నేక్
స్టిలెట్టో స్నేక్
సా స్కేల్డ్ వైపర్
కింగ్ కోబ్రా