దేశంలో దొంగతనాలు అంతూపంతు లేకుండా పోతున్నాయి. ఇది చట్టరీత్య నేరమని తెలిసిన కూడా ఇలాంటి పనులకు ఒడికడుతున్నారు కొందరు దుర్మార్గులు. తాజాగా ఎస్‌బీఐ బ్యాంకులో దొంగలు పడినట్టు బ్యాంకు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగలు 11కోట్ల నాణేలు స్వాధీనం చేసుకోవడంతో..ఎస్‌బీఐని రంగంలోకి దింపారు అధికారులు.
ఈ ఘటన రాజస్థాన్ లోని మెహందీపూర్ బాలాజీకి చెందిన ఎస్‌బీఐ బ్రాంచ్ లో చోటుచేసుకుంది. 3 కోట్లపైనే నగదు మాయమవ్వడంతో ఎస్‌బీఐని విచారణ జరిపించాలంటూ రాజస్థాన్ హైకోర్ట్ ను సంప్రదించింది. దాంతో ఎస్‌బీఐని కోర్ట్ ఆదేశించడంతో కేసు నమోదు చేసి సోమవారం దర్యాప్తు ప్రారంభించారు.
అయితే ఈ నేపథ్యంలో మెహందీపూర్ బాలాజీ శాఖలో నగదు నిల్వల విషయంలో తేడాలు ఉన్నాయేమోనని నగదు లెక్కించారు. 2వేల కోట్ల నగదు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 11కోట్ల నాణేలు మాయమయినట్టు లెక్కింపులో తేలింది. గత ఏడాదిలో కొంతమంది దుండగులు లెక్కింపును నిలిపివేయాలని బెదిరించినట్టు ఎఫ్ఐఆర్ లో నమోదు చేసుకున్నారు.