భార్య కోరికలు తీర్చడం కోసం యూ ట్యూబ్ వీడియోలు చూసి ఈ భర్త ఏం చేశాడంటే

భార్య కోరికలు తీర్చేందుకు ఓ భర్త దారితప్పాడు.

0
116

అతి కోరికలు, మన స్ధోమతకు మించిన ఖర్చులు ఎప్పుడైనా ఇబ్బందే. ఈ విషయంలో మనకి నియంత్రణ ఉండాలి. లేకపోతే ఆలోచనలు పక్కదారి పడతాయి. ఇక్కడ ఇదే జరిగింది. భార్య కోరికలు తీర్చేందుకు ఓ భర్త దారితప్పాడు. ఏకంగా చైన్ స్నాచర్ అవతారం ఎత్తాడు. చివరకు బుక్కయ్యాడు. మరి ఈ ఘటన ఎక్కడ జరిగిందో చూద్దాం.

పుణెలోని వాకడ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫుడ్ డెలివరీ బాయ్గా పని చేసేవాడు. ఈ మధ్య అతనికి వివాహం జరిగింది. ఇక భార్యకి ఏ కష్టం లేకుండా చూడాలి అని భావించాడు. ఆమె కోరికలు అడిగాడు. ఆమె చెప్పింది విని షాక్ అయ్యాడు. ఇక ఫుడ్ డెలివరీ బాయ్ గా అతనికి వచ్చే జీతంతో కుటుంబం, తిండి, ఉండటానికి ఇబ్బంది ఉండదు. కాని ఆమె కోరికలు తీర్చాలంటే తన జీతం సరిపోదు.

దీంతో దారి తప్పాడు. చైన్ స్నాచింగ్ను ఎంచుకున్నాడు. యూట్యూబ్ లో పలు చైన్ స్నాచింగ్ వీడియోలను చూశాడు. రద్దీ లేని ప్రాంతాలు చూసుకుని అక్కడ ఇలా స్కెచ్ వేసేవాడు. ఆదివారం ఓ ప్రాంతంలో ఉన్నాడు. ఈ సమయంలో అతని కదలికలు అనుమానంగా ఉండటంతో పోలీసులు పట్టుకుని ప్రశ్నిస్తే, అసలు విషయం చెప్పాడు. ఇప్పటికే ఏడు చోట్ల ఇలా చెయిన్ స్నాచింగ్ చేశాడు.
121 గ్రాముల బంగారం, రెండు బైక్లు దొంగిలించానని పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నాడు.