ఈ గ్రామం మన దేశంలోనే ఉంది – అయినా మనకు నో ఎంట్రీ

This village is in our country but we have no entry

0
82

మన దేశంలో ఎవరు ఎక్కడికి అయినా వెళ్లవచ్చు. మన దేశంలో నలుమూలలా ఏ స్టేట్ కి అయినా మ‌నం వెళ్లవచ్చు .వేరే దేశం వెళ్లాలి అంటే పాస్ పోర్ట్ వీసా ఉండాలి . అయితే ఈ ప్రదేశంలోకి మాత్రం మనకు ప్రవేశం లేదు. అయితే ఇది భారత్ లోనే ఉంది. కాని ఇక్కడకు ఎందుకు ప్రవేశం లేదు అంటే, ఇది మనకే కాదు ఎవరికి ప్రవేశం లేని ప్రాంతం. మరి ఈ గ్రామం ఎక్కడ ఉంది అనేది చూద్దాం.

హిమాచల్ ప్రదేశ్ లో మలానా అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోకి ఇతరులు ఎవరికీ ప్రవేశం లేదు. ఇక వేరే గ్రామం వారిని, వేరే స్టేట్ వారిని, మన ఇండియన్స్ ని, ఇతర దేశాల వారికి ఎవరికి వీరు ఎంట్రీ ఇవ్వరు.
ఈ గ్రామాన్ని వారు పవిత్రమైందిగా భావిస్తారు. ఇక్కడ భారీ రాళ్లు ఉంటాయి. వాటిని చాలా పవిత్రంగా భావిస్తారు వాటిని ఎవరిని తాకనివ్వరు ఈ గ్రామస్తులు.

ఇక్కడకు ఎవరైనా వచ్చినా వారితో కలిసి ఉన్నా తమ ఆచారాలు పోతాయని, కలుషితం అవుతామని వారు ఎవరిని రానివ్వరు. వీరికి నీరు సమస్య లేదు, పవర్ సమస్య లేదు. ఇక్కడ వారు వ్యవసాయం చేసుకుంటారు. ఆ పంటతోనే తింటారు అక్కడ విద్యాలయాలు ఉన్నాయి వారి విద్య వారే చెప్పుకుంటారు.