టీఎస్: ఆర్టీసీ బస్సులో గంజాయి రవాణా..ముగ్గురి అరెస్ట్

Three arrested for transporting cannabis in RTC bus

0
90

తెలంగాణ: ఎన్ని చర్యలు తీసుకున్నా గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. కొందరు అక్రమార్కులు విచ్చలవిడిగా గంజాయిని తరలిస్తున్నారు. తాజాగా ట్రావెల్‌ బ్యాగుల్లో గంజాయిని పెట్టి బస్సులో ప్రయాణికుల్లా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను వరంగల్‌ జిల్లా రాయపర్తి వద్ద టాస్క్​ఫోర్స్, పోలీసులు కలిసి పట్టుకున్నారు.

గంజాయిని తరలిస్తున్న ముగ్గురు యువకులను అరెస్టు చేశారు పోలీసులు. మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 64 కిలోల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ దాదాపు రూ.6.4లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు.