సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు స్పాట్ డెడ్

0
100

ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా సిద్ధిపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారీప్రాణనష్టం చవిచూడవలసి వచ్చింది. కారును లారీ ఢీ కొకొట్టడంతో ముగ్గురు మృతిచెందిన ఘటన  చిన్నకోడూరు మండలం మల్లారం స్టేజీ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో  కారులో ఉన్న భార్యాభర్తలతో పాటు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేయడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ సహాయకచర్యలు చేపట్టి మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు లారీ డ్రైవర్‌ మద్యం మత్తే కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్దారించారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.