ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు తెలుగు విద్యార్థులతో సహా ముగ్గురు మృతి

0
84

స్కాట్లాండ్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  విద్యార్థులు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరణించిన వారిలో హైదరాబాద్‌, నెల్లూరుకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉండగా.. మరొక విద్యార్థి బెంగళూరుకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. ఈ ఘటన గత శుక్రవారం జరిగింది.