Flash: వరంగల్ జిల్లాల్లో ఘోర ప్రమాదం..ముగ్గురు స్పాట్ డెడ్

0
124

తెలంగాణాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా వరంగల్ జిల్లాల్లో జరిగిన ప్రమాదంలో ఘోర ప్రాణనష్టం చవిచూడవలసి వస్తుంది. అశోక నగర్ శివారు పర్వాతండా సమీపంలోని దుస్సముద్రం కాలువ కట్ట మీది నుంచి వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ట్రాక్టర్ లో ఉన్న ముగ్గురు కూలీలు అక్కడిక్కడే మృతిచెందగా..మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం నర్సంపేట ఆసుపత్రికి తరలించారు.