మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ..అగ్రనేత అరెస్ట్

Tight backlash against Maoists, top leader arrested

0
72

మావోయిస్టు పార్టీలో నెంబర్ 2గా భావించే ఒకరైన కిషన్ దా అలియాస్ ప్రశాంత్ బోస్ ను ఝార్ఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన భార్య షీలా మరాండీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కిషన్ దా సీపీఐ మావోయిస్టు పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఆయన తలపై రూ.1 కోటి రివార్డు ఉండడం గమనార్హం. సెరాయ్ కెలా జిల్లాలో కిషన్ దాను శుక్రవారం అరెస్ట్ చేశారు.

70వ పడిలో ఉన్న కిషన్ దా మావోయిస్టు పార్టీలో కీలక సిద్ధాంతకర్తగా గుర్తింపు పొందారు. ఉత్తర భారతంలో నక్సల్ కార్యకలాపాలు నిర్వహించే మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎంసీసీఐ), సీపీఐఎంల్ (పీపుల్స్ వార్)ల విలీనంలో కిషన్ దా ప్రముఖ పాత్ర పోషించారు. ఈ రెండు గ్రూపుల కలకయితో సీపీఐ (మావోయిస్ట్) పేరిట దేశంలో ఒకే నక్సల్ గ్రూపు ఆవిష్కృతమైంది.