ఈ ఊరిలో ఉండాలంటే కచ్చితంగా బాడీలో ఆ పార్ట్ తీసేయాల్సిందే

To be in this village you definitely have to remove that part from the body

0
96

మనిషి కష్టజీవి తనకు నచ్చిన చోట పని చేసుకుంటూ జీవిస్తాడు. అయితే ఉన్న ప్రాంతంలో అక్కడ వారి రూల్స్ ఆ దేశాల చట్టాలు ఫాలో అవ్వాల్సిందే. ఇలా మనిషి ప్రపంచంలో ఎక్కడైనా ఉండవచ్చు. కొన్ని ప్రాంతాల్లో వింత వింత ఆచారాలు, రకరకాల రూల్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఇలాంటి రూల్ ఉంది.

ఈ గ్రామంలో నివసించాలంటే శరీరంలో ఒక భాగం ఉండకూడదట. ఇదేం రూల్ అని అనుకుంటున్నారా. నిజమే మీరు ఆ పార్ట్ తొలగించుకున్నారు అని సర్టిఫికెట్ చూపించాల్సిందే.
అంటార్కిటికాలోని విల్లాలాస్ ఎస్టార్లెస్ అనే గ్రామంలో ఈ వింత రూల్ ఉంది.

అంటార్కిటిక్ లోని విల్లాలాస్ ఎస్టార్లెస్ గ్రామంలో ఎవరైనా ఉండాలి అంటే, మన శరీరంలో అపెండిక్స్ ను తొలగించుకోవాలట. ఇలా తొలగించుకున్నారు అని సర్టిఫికెట్ చూపించాలి.
గతంలో ఈ ఊరిలో వైద్యసదుపాయాలు లేవట. ఈ గ్రామంలో మొత్తం 154 మందే నివసిస్తున్నారు.
ఇక్కడ నుంచి ఆస్పత్రికి వెళ్లాలి అంటే 1000 కి.లో మీటర్లు వెళ్లాలి. అపెండిసైటిస్ వస్తే ప్రాణాలకే ప్రమాదం అందుకే 2018 నుంచి ఈ రూల్ పాస్ చేశారు.