Drugs Case | డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ టాలీవుడ్ హీరో ప్రియురాలు!

-

Drugs Case | హైదరాబాద్ నార్సింగ్ లో డ్రగ్స్ కలకలం రేగింది. పోలీసులు లావణ్య అనే యువతి వద్ద నుంచి 4 గ్రాముల ఎండీఎంఏ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. లావణ్య ను టాలీవుడ్ యంగ్ హీరో ప్రియురాలుగా గుర్తించినట్లు సమాచారం. ఆమె గోవా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. NDPS యాక్ట్ కింద పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

Drugs Case | లావణ్య గతంలోనూ గోవా నుండి డ్రగ్స్ తీసుకొచ్చిందని పోలీసుల విచారణలో తేల్చారు. గోవా నుండి తెచ్చిన డ్రగ్స్ ని హైదరాబాద్ లో అమ్మడంతో పాటు, ఆమె కూడా డ్రగ్స్ తీసుకునేదని గుర్తించారు. లావణ్య(Lavanya) తోపాటు మరో ఇద్దరికి ఈ కేసుతో సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని కూడా వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకుని విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు. లావణ్య ప్రముఖ టాలీవుడ్ హీరో ప్రియురాలు అని చెబుతున్నప్పటికీ, సదరు హీరో పేరును మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచారు. దీంతో మరోసారి టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం సంచలనంగా మారింది. కాగా, పోలీసులు లావణ్యను మరికాసేపట్లో రిమాండ్ కి తరలించనున్నారు.

Read Also: డైరెక్టర్ కొరటాల శివకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...