గంజాయి కలకలం..టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ అరెస్ట్‌

0
81

సినీ పరిశ్రమలో గంజాయి కలకలం రేపింది. డ్ర‌గ్స్ వ్యవ‌హారాలలో ఎంతో మంది నిందితులు పట్టుబడ్డారు. అయితే తాజాగా అదే అంశంలో సోమ‌వారం నాడు ఓ కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ హాథిరామ్‌ సినీ ఆర్టిస్టుల‌కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్న విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అయితే ఈ నేపథ్యంలో..హాథిరామ్‌ను రాచ‌కొండ‌ పోలీసులు అరెస్ట్ చేసి..190కిలోల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అంతేకాకుండా హాథిరామ్ తో సహా మరో ఆరుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో వ్య‌క్తి త‌ప్పించుకుని పారిపోయాడ‌ని పోలీసులు తెలిపారు.

క‌ర్ణాట‌క నుంచి కారులో గంజాయిని తర‌లిస్తుండ‌గా పోలీసులు ప‌ట్టుకున్నారు. కురుక్షేత్రం,యుద్ధం శ‌ర‌ణం గ‌చ్చామి చిత్రాల‌కి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశాడు హాథిరామ్. రెండు సినిమాల‌కు స‌హాయ ద‌ర్శ‌కత్వం వహించిన హాథిరామ్‌ ఇలాంటి పని చేయడంతో సినీ పరిశ్రమలో తలెత్తుకోలేని విషయంగా చెప్పుకోవచ్చు.