Flash: డ్రగ్స్ కేసులో టోనీ ఏజెంట్లు అరెస్టు

0
87

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న టోనీ అనుచరులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు ఏజెంట్లు ఎవరెవరికి మాదక ద్రవ్యాలు విక్రయించారనే కోణంలో పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. అఫ్తాబ్, ఆరిఫ్, ఇర్ఫాన్ అనే ముగ్గురు ఏజెంట్లు టోనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు నిర్వహించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. టోనీ దాదాపు 15 బ్యాంకు ఖాతాల్లో మాదక ద్రవ్యాల డబ్బులను జమ చేశాడు. అందులో ఆరిఫ్ అనే ఏజెంట్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాలోనే కోటి రూపాయలు కేవలం ఆరు నెలల వ్యవధిలో జమ అయినట్లు ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు..