విషాదం..ఇద్దరిని బలిగొన్న రోడ్డు ప్రమాదం

0
100

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరిని బలిగొంది. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడు వద్ద రోడ్డుపై నిల్చున్న వారిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  సంతగుడిపాడుకు చెందిన నామాల రాజశేఖరరెడ్డి (22) అనే యువకుడుతో పాటు లారీ క్లీనర్‌ బిల్లా కోటేశ్వరరావు(46) మృతి చెందారు. లారీ డ్రైవర్‌ కొల్లాబత్తుల రాజేశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. టీ తాగేందుకు రోడ్డుపై లారీ నిలిపి లారీని శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.