విషాదం..కూలిన గోదాం-ఆరుగురు మృతి

0
103

దిల్లీలో విషాదం నెలకొంది. నిర్మాణంలో ఉన్న ఓ గోదాము కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది గాయపడగా.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల కింద మరికొంత మంది కూలీలు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక​ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.