ఆ తల్లికి ఏం కష్టమొచ్చింది..పేగు తెంచుకొని కన్న బిడ్డలతో సహా తను తనువు చాలించింది. ఈ విషాదకర ఘటన ఏపీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..శ్రీకాకులం జిల్లా దమ్మల వీధిలో నివాసం ఉంటున్న ధనలక్ష్మి అనే మహిళకు సోనియా (11), యశ్వంత్ (9) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తల్లికి భరించలేని బాధలొచ్చాయో, లేక పిల్లలను పోహించలేకపోయిందో తెలీదు కానీ ఆ పిల్లలకు ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.